ఆరోగ్యం బాగాలేనప్పుడు, సులబంగా చేయగలిగే రెసిపీ మీకోసం




కావాల్సిన పదార్దాలు :

1.    బియ్యం ( 1 గ్లాసు )
2.    పెరుగు
3.    పచిమిర్చి ( రెండు )
4.    కరివేపాకు ( ఒక రెబ్బ )
5.    నూనె ( 3 టేబుల్ స్పూన్లు )
6.    పచిశనగ, వేరుశెనగ పప్పు ( కావాల్సినన్ని )
7.    అల్లం తురుము ( కొంచెం )
8.    ఎండుమిరప, తాళింపు గింజలు.

తయారీ విదానం :

1.    ముందుగా ఒక గ్లాసు బియ్యం తీసుకుని సుబ్రంగా కడగి, అందులో కావల్సినన్ని నీరు పోసుకోవాలి.
2.    ఇప్పుడు ఒక కుక్కర్ లో అడుగున కొన్ని నీల్లు పోసి స్టౌవ్ మీద పెట్టి ఆ కడిగిన బియ్యాన్ని ఒక గిన్నెలో తీసుకుని ఆ స్టౌవ్ లో పెట్టాలి.
3.    ఒక మూడు విసిల్స్ వచే లోపు పచిమిర్చి , ఒక రెబ్బ కరివేపాకు తరిగి పెట్టుకోవాలి
4.    మూడు విసిల్స్ ఐపోయాక అన్నం తీసి వేరే గిన్నె లో తీసుకోని చల్లార పెట్టుకోవాలి.
5.    ఇప్పుడు ఒక బాండి తీసుకుని స్టౌవ్ మీద పెట్టి అందులో 3 స్పూన్ల నూనె వేయాలి.
6.    నూనె కొంచెం కాగాక అందులో పచిశనగ, వేరుశనగ పప్పులు వేసుకోవాలి.
7.    వాటితో పాటు కొంచెం అల్లం తురుము, ఎండు మిరపకాయలు, తాలింపు గింజలు వేసుకోని తిప్పుతూ వుండాలి.
8.    కొంచెం సేపటి తర్వాత తరిగి పెట్టుకున్న పచిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి.
9.    ఇప్పుడు అన్ని చక్కగా వేగాక స్టౌవ్ ఆపి పక్కన పెట్టుకోవాలి.
10.                       ఇప్పుడు ఇంతకుముందు పక్కన పెట్టుకున్న అన్నం లో సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసుకుని కలుపుకోవాలి.
11.                       ఇప్పుడు అందులో ఇంతకుముందు చేసి పెట్టుకున్న దాన్ని వేసి చిన్నగా కలపాలి.
12.                       ఇక ఒక గ్లాసు పెరుగు తీసుకుని ఆ కలిపి పెట్తుకున్న అన్నం లో వేసి కొంచెం నెమ్మదిగా కలపాలి.
13.                       అంతే ఎంతో రుచికరమైన ఆరోగ్యమైన రెసిపి రెడీ.

Comments