Egg curry recipe..కోడి గుడ్లు కూర తయారీ

కోడి గుడ్లు కూర లేదా రెసిపి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం...


కావాల్సిన పదార్దాలు

1.       4 ఉడికించిన కోడి గుడ్లు
2.       1 కప్పు బాగా తరిగిన ఉల్లిపాయలు
3.       1 తరిగిన పచిమిర్చి
4.       2 తరిగిన టమోటాలు
5.       1 స్పూన్ దనియాల పొడి
6.       1 స్పూన్ కొబ్బరి తురుము
7.       2 స్పూన్ల నూనె
8.       ½ స్పూన్ ఉప్పు
9.       1 ¼ స్పూన్ల అల్లం పేస్టు
10.   ½ స్పూన్ జీలకర
11.   ¼ స్పూన్ పసుపు
12.   ¾ స్పూన్ కారం
13.   ¾ లేదా 1 స్పూన్ గరం మసాలా
14.   1 లేదా 2 రెబ్బల పుదీన

తయారీ విదానం

·         ముందుగా ఒక బాండి తీసుకొని అందులో 2 స్పూన్ల నూనె వేసి కొంచెం కాగనివ్వాలి.
·         అందులో జీలకర , పుదీన వేసి కొంచెం ఉడికిన తర్వాత అందులో ఉల్లిపాయలు మరియు పచిమిరప కాయలు వెయ్యాలి.
·         ఉల్లిపాయలు బంగారం కలర్లోకి వచేదాక ఉడికించి, అందులో అల్లం పేస్టు వేసి అల్లం సువాసన వచేదాక ఉడికించాలి.
·         ఇప్పుడు అందులో టమోటా ముక్కలు వేసి ఉల్లిపాయలు మరియు టమోటాలు బాగా కలిసే దాక కలపాలి.
·         ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర వేయాలి.
·         వేసిన తర్వాత బాగా కలపాలి, అలా కొంచెం సెపు మంచి సువాసన వచేదాక కలపాలి.
·         ఎప్పుడైతే బాగా తయారైంది అనిపిస్తుందో వెంటనే కోడి గుడ్లను వేయాలి.
·         గుడ్లు బాగా దోరగా వేగే వరకు ఒక 2 నిమిసాలు ఉంచాలి.
·         ఇప్పుడు కొంచెం చిక్కగా అయ్యేలా నీల్లు పోయాలి.
·         ఇప్పుడు మంటను తగ్గించి కొంచెం ఉడకనివ్వాలి.
·         ఇప్పుడు మంటను ఆపేసి దించిన తర్వాత అందులో పుదీన ఆకులను వేసుకోవాలి.

         అంతే నోరూరించే అందమైన కోడి గుడ్లు కూర రెడీ

Comments